ap7am logo

ముంబై నుంచి వ‌చ్చిన వ‌ల‌స కార్మికుల‌కు క‌రోనా పాజిటివ్.. అధికారుల‌తో స‌మీక్ష చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

Sat, May 23, 2020, 11:32 AM
Related Image వ‌ల‌స కార్మికుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు మండ‌లం అమ్మాపురం, కంటాయ‌పాలెం, మ‌డిప‌ల్లె గ్రామాల‌ను రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సంద‌ర్శించారు.
ముఖ్యంశాలు:
  • ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టించి గ్రామాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం, అధికారులు అండ‌గా ఉంటార‌ని భ‌రోసా క‌ల్పిస్తూ, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించిన మంత్రి ఎర్ర‌బెల్లి
  • ముంబై నుంచి ఈ మ‌ధ్య వ‌చ్చిన వ‌ల‌స కార్మికుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లుగా నిర్ధారించిన వైద్యులు
  • అమ్మాపురంలో ఒక‌రికి, కంఠాయ‌పాలెం, మ‌డిప‌ల్లెల్లో రెండు కేసులు చొప్పున పాజిటివ్ వ‌చ్చిన‌ట్లుగా మంత్రికి వివ‌రించిన అధికారులు
  • దీంతో ఆయా గ్రామాల‌ను క్వారంటైన్ చేసిన అధికారులు, పోలీసులు
  • క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వాళ్ళంద‌రినీ మ‌హ‌బూబాబాద్ జిల్లా హాస్పిట‌ల్ కి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు
  • కాగా, ఆయా గ్రామాల్లోకి ముంబ‌యి నుంచి వ‌చ్చిన వారు ఎవ‌రెవ‌రిని క‌లిశారు?  వారి ఆరోగ్య ప‌రిస్థితుల‌పై ఆరా తీస్తున్న అధికారులు
  • ఈ ద‌శ‌లో ప్ర‌జ‌ల్లో ధైర్యం క‌ల్పించి, భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని, సామాజిక‌, భౌతిక దూరం పాటిస్తూ, ఎవ‌రికి వారు లాక్ డౌన్ ని ప‌క‌డ్బందీగా పాటించాల‌ని సూచించిన మంత్రి ఎర్ర‌బెల్లి
  • స్వీయ నియంత్ర‌ణ‌లో ఉండాల‌ని, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించిన మంత్రి
  • అనంత‌రం అధికారుల‌తో స‌మీక్ష చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి
  • జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా ఎస్పీ, డిఎం అండ్ హెచ్ఓలు, తొర్రూరు పోలీసులు, ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో అమ్మాపురం, కంఠాయ‌పాలెం, మ‌డిప‌ల్లె గ్రామాల ప‌రిస్థితుల‌పై చ‌ర్చించిన మంత్రి
  • పూర్తి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితి మిన‌హా మ‌రొక‌రికి కూడా రాకుండా ఆ గ్రామాల‌ను క్వారంటైన్ చేయాల‌ని, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న చైత‌న్య‌ప‌రుస్తూండాల‌ని చెప్పిన మంత్రి
  • ఆయా గ్రామాలను క్వారంటైన్ చేసిన స‌మ‌యాల్లో మంచినీరు‌, ఆహారం, నిత్యావ‌స‌ర స‌రుకులు, ఇత‌ర స‌మ‌స్య‌లు లేకుండా జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని ఆదేశించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
  • గ్రామాల్లో వాలంటీర్ల‌ను నియ‌మించి, వారి ద్వారా ప్ర‌జావ‌స‌రాలు తీర్చాలి
  • ఇలాంటి స‌మ‌యంలో గ్రామాల్లోని నేత‌లు, ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాలి. ఆదుకోవాలి
  • ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంతుల‌కు గురి కావాల్సిన ప‌నిలేదు. ధైర్యంగా ఉండాలి
  • ప్ర‌భుత్వం అన్ని ర‌కాల జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్న‌ది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)