ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటాం: ఏపీ మంత్రి భరోసా

Related image

  • కరోనా పాజిటివ్ పేషంట్లతో ఫోన్లో మాట్లాడి యోగక్షేమాలు కనుక్కొన్న మంత్రి
  • సీఎంకు ధన్యవాదాలు తెలిపిన డిశ్చార్జ్ అయిన కరోనా పేషెంట్
విజయవాడ: పేషంట్స్ కు మనో ధైర్యం నింపడంతో పాటు వారి యోగక్షేమాలు కనుక్కోవడం, వారికి కావలసిన సదుపాయాలపై దృష్టి సారించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం బ్రాహ్మణ వీధి దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయవాడలో కరోనా పాజిటివ్ వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో  వీడియో కాల్ మాట్లాడారు. తొలుత చిట్టి నగర్ కు చెందిన రాజశేఖర్ తో (పేరు మార్చడం జరిగింది) మాట్లాడారు.

అదే విధంగా నగరంలో కరోనా వచ్చిన పేషెంట్లను, డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ తోనూ మంత్రి ఫోన్ లో వీడియో కాలింగ్ మాట్లాడారు. చాలా మంది సదుపాయాలు బాగున్నాయని మంత్రికి తెలిపారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్, పిన్నమనేని సిద్ధార్థ, గన్నవరం క్వారంటైన్ సెంటర్లో ఉన్న పేషెంట్స్ తోనూ ఫోన్లో మంత్రి మాట్లాడి వారి యోగక్షేమాలు కనుక్కోవడంతో పాటు వారికి అవసరమైన సదుపాయాలపై సంబంధిత హాస్పిటల్ వైద్యాధికారికి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని పేషెంట్లకు మంత్రి భరోసానిచ్చారు. రెండు మూడు రోజుల క్రితం డిశ్చార్జ్ అయిన వారు తాము క్షేమంగా ఉన్నామని, చికిత్స అందించిన డాక్టర్లకు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

More Press Releases