ap7am logo

భార‌తీయ సంస్కృతీ, సంప్ర‌దాయాలే ప్ర‌పంచానికి ఆద‌ర్శం: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి

Mon, Mar 30, 2020, 06:10 PM
Related Image
 • మ‌న ఆహారపు అల‌వాట్లే మ‌న‌కు శ్రీ‌రామ‌ర‌క్ష‌

 • కరోనా దెబ్బకు అత్యాధునిక సంపన్న దేశాలే సతమతమవుతున్నాయి

 • ప్రపంచానికంటే ముందే మనం మేల్కొన్నాం

 • ప్రధాని మోడీ, సీఎం కెసిఆర్ లు ముందే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు

 • ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు లాక్ డౌన్ కి సహకరించాలి

 • స్వీయ, కుటుంబ, సమాజ, దేశ రక్షణకే స్వయం నియంత్రణ

 • హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్ మిన‌హా, అదృష్ట‌వ‌శాత్తు మిగ‌తా ప్రాంతాల్లో క‌రోనా కేసుల్లేవు

 • భూపాల‌ప‌ల్లి ప్రభుత్వ దవాఖానా లో వెంటిలేట‌ర్ల ఏర్పాటు కృషి

 • తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజల్ని రక్షిస్తున్న సిబ్బందికి కరోనా ప్రూఫ్ డ్రెస్సులు

 • స్థానికంగానే మ‌హిళా సంఘాల ద్వారా మాస్క్ ల త‌యారీ, వినియోగం

 • నిత్యావసర సరుకులు, కూరగాయల కృత్రిమ కొర‌త సృష్టిస్తే...పీడీ యాక్టు కేసులు, భారీ జ‌రిమానాలు

 • లాక్ డౌన్ ని పాటించని వాళ్ళపై కఠిన చర్యలు త‌ప్ప‌వు

 • ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేయడం సిఎం కెసిఆర్ గారి చారిత్రాత్మక నిర్ణ‌యం

 • దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతాంగానికి బాస‌ట‌గా తెలంగాణ ప్ర‌భుత్వం

 • మీ టోకెన్లు వ‌చ్చే వ‌ర‌కు రైతులు కొనుగోలు కేంద్రాల‌కు రావొద్దు

 • ధాన్యం కొనుగోలుకు రూ.30వేల కోట్లు... మక్కజొన్నల కొనుగోలుకు రూ.3వేల కోట్లు

 • ఈ సెలవుల వరకు గోదాముల‌కు తాత్కాలికంగా స్కూల్స్, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు

 • రైతులకు ఇబ్బందులు కాకుండా కొనుగోలుకు అదనంగా మరికొన్ని కేంద్రాలు

 • మహారాష్ట్ర, చత్తీస్ గడ్ వలస కూలీలకు భోజ‌నం, వ‌స‌తి ఏర్పాట్ల‌కు అధికారుల‌కి ఆదేశాలు

 • భూపాల‌ప‌ల్లి జిల్లా స‌మీక్ష‌లో తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

భూపాల‌ప‌ల్లి, మార్చి 30: మ‌న భార‌తీయ సంస్కృతీ, సంప్ర‌దాయాలే ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా నిలిచాయి. మ‌న ఆహారపు అల‌వాట్లే మ‌న‌కు శ్రీ‌రామ‌ర‌క్ష‌. కరోనా దెబ్బకు అత్యాధునిక సంపన్న దేశాలే సతమతమవుతున్నాయి. ప్రపంచాని కంటే ముందే మనం మేల్కొన్నాం. ప్రధాని మోడీ, సీఎం కెసిఆర్ లు ముందే చేప‌ట్టిన ముందు జాగ్రత్త చర్యలు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు లాక్ డౌన్ కి సహకరించాలి. స్వీయ, కుటుంబ, సమాజ, దేశ రక్షణకే స్వయం నియంత్రణ పాటిస్తున్నాం... అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.

హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్ మిన‌హా, అదృష్ట‌వ‌శాత్తు మిగ‌తా ప్రాంతాల్లో క‌రోనా కేసుల్లేవు... అని మంత్రి చెప్పారు. భూపాల‌ప‌ల్లి జిల్లాలో క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌, వ‌ల‌స కూలీల స్థితిగ‌తులు, ధాన్యం, మ‌క్క జొన్న పంట‌లు-కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి పలు కీల‌క‌ అంశాల‌పై జిల్లా కలెక్ట‌ర్ స‌మావేశ మందిరంలో మంత్రి ఎర్ర‌బెల్లి సోమ‌వారం స‌మీక్షించారు. అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు.

సిఎం దార్శ‌నిక‌త‌కు నిద‌ర్శ‌నం-ధాన్యం,మ‌క్క‌జొన్న‌ల కొనుగోలు:
రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం పండించిన ప్ర‌తి గింజ‌నీ కొనుగోలు చేయ‌డానికి మ‌న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు నిర్ణ‌యించార‌ని, ఇది చారిత్ర‌క నిర్ణ‌య‌మ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఎక్క‌డా లేని విధంగా చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మం వ‌ల్ల అన్న‌దాత రైత‌న్న‌కు ఎలాంటి ఇబ్బందులు రావ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ధాన్యం కొనుగోలుకు రూ.30వేల కోట్లు... మక్కజొన్నల కొనుగోలుకు రూ.3వేల కోట్లు సిఎం కెసిఆర్ కేటాయించార‌న్నారు. దీని వ‌ల్ల రైతును ఆదుకోవ‌డ‌మేగాక‌, ఆర్థిక మాంద్యం నేప‌థ్యంలో, రానున్న కాలంలో, రాష్ట్రంలో ఆహార కొర‌త లేకుండా చూశార‌ని, ఇది సిఎం కెసిఆర్ దార్శ‌నిక‌త‌కు, ముందు చూపుకి నిద‌ర్శ‌న‌మ‌ని మంత్రి చెప్పారు.

భూపాల‌ప‌ల్లి జిల్లాలో:
జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో విదేశాల నుంచి వ‌చ్చిన వారు 50 మంది ఉన్నార‌ని, అందులో 48 మంది ఇంటి క్వారంటైన్ లో ఉన్నార‌ని మంత్రి ద‌యాక‌ర్ రావు చెప్పారు. ఇద్ద‌రు వేరే జిల్లాలో ఉన్నార‌న్నారు. 14 రోజుల క్వారంటైన్ అయిపోయిన వాళ్ళు 30 మంది వారి ఇళ్ళకు చేరార‌న్నారు. విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్ళ‌తో 14 మంది కలిసి తిరిగార‌న్నారు. ఆ 14 మందితోపాటు 48మంది కలిపి మొత్తం 62 మంది క్వారంటైన్ లో ఉన్నార‌ని మంత్రి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు. సింగ‌రేణి ఏరియా హాస్పిట‌ల్, చిట్యాల సిహెచ్ సి లో 24 మంది, కాళేశ్వ‌రం హ‌రిత కాక‌తీయ లో మిగ‌తావాళ్ళున్నార‌ని మంత్రి చెప్పారు.

అయితే, భూపాల‌ప‌ల్లి ప్రభుత్వ దవాఖానా లో వెంటిలేట‌ర్ల ఏర్పాటు కృషి చేస్తామ‌ని ఎర్ర‌బెల్లి అన్నారు. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజల్ని రక్షిస్తున్న జిల్లా సిబ్బందికి కరోనా ప్రూఫ్ డ్రెస్సులు అంద‌చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. కొర‌త ఉన్నందున‌ స్థానికంగానే మ‌హిళా సంఘాల ద్వారా మాస్క్ ల త‌యారీ, వినియోగం చేయాల‌ని సూచించారు. నిత్యావసర సరుకులు, కూరగాయల కృత్రిమ కొర‌త సృష్టిస్తే...పీడీ యాక్టు కేసులు పెట్టి, భారీ జ‌రిమానాలు విధిస్తామ‌ని వ్యాపారుల‌ను హెచ్చ‌రించారు. లాక్ డౌన్ ని పాటించని వాళ్ళపై కఠిన చర్యలు త‌ప్ప‌వన్నారు. ఈ ఆప‌త్కాలంలో అంతా స‌హ‌క‌రించాల‌ని మంత్రి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌ను కోరారు.

ఇక రైతులు పండించిన ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేయడం సిఎం కెసిఆర్ చారిత్రాత్మక నిర్ణ‌యం అన్నారు మంత్రి ఎర్రబెల్లి. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతాంగానికి బాస‌ట‌గా తెలంగాణ ప్ర‌భుత్వం నిలిచింద‌ని మంత్రి చెప్పారు. రైతాంగానికి అధికారులు టోకెన్లు ఇస్తార‌ని, టోకెన్లు వ‌చ్చే వ‌ర‌కు రైతులు కొనుగోలు కేంద్రాల‌కు రావొద్దు చెప్పారు. ఈ సెలవుల వరకు గోదాముల‌కు తాత్కాలికంగా స్కూల్స్, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు వాడుకోవ‌చ్చ‌ని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కాకుండా కొనుగోలుకు అదనంగా మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాలో 65వేల ఎక‌రాల్లో ధాన్యం పంట‌లు వేశార‌ని, ల‌క్షా 76వేల మెట్రిక్ ట‌న్నుల దిగుబ‌డి అంచ‌నా ఉంద‌న్నారు. అలాగే మ‌క్క‌జొన్న పంట‌లు 16,980 ఎక‌రాల విస్తీర్ణంలో వేశార‌ని, 39వేల మెట్రిక్ ట‌న్నుల దిగుబ‌డి అంచ‌నా ఉంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.

అలాగే మిర‌ప పంట‌ల రైతుల‌ను కూడా ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని మంత్రి తెలిపారు. భూపాల‌ప‌ల్లి జిల్లాలో 15వేల ఎక‌రాల్లో సాగు చేశార‌ని, 425 మెట్రిక్ ట‌న్నులు దిగుబ‌డి అంచ‌నా ఉంద‌న్నారు.

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి 4,007 మంది వ‌ల‌స కూలీలు వివిధ ప‌నుల నిమిత్తం వ‌చ్చార‌న్నారు. ఎక్కువ మంది మ‌హ‌దేవ్ పూర్ లో ఉన్నార‌న్నారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి ప‌నుల‌కోసం వ‌ల‌స వ‌చ్చిన కూలీలంద‌రినీ సీఎం కెసిఆర్ చెప్పిన‌ట్లు కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌ని ఎర్ర‌బెల్లి చెప్పారు. వలస కూలీలకు భోజ‌నం, వ‌స‌తి ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కి మంత్రి ఆదేశాలు ఇచ్చారు.

ఈ స‌మీక్ష‌లో భూపాల‌ప‌ల్లి జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ శ్రీహర్షిణి, ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ అబ్దుల్ అజీం, జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ‌, వ్య‌వ‌సాయ‌, మార్కెటింగ్, గిడ్డంగులు, ర‌వాణా, పోలీసు త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)