Pollard: రాణించిన డికాక్, పొలార్డ్ మెరుపుదాడి... ముంబయి 176/6

  • దుబాయ్ లో ముంబయి వర్సెస్ పంజాబ్
  • మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి
  • డికాక్ అర్ధసెంచరీ
Pollard and Decock makes valuable runs

ఐపీఎల్ లో నేడు జరుగుతున్న రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు ఆడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబయి మొదట బ్యాటింగ్ చేసింది. రోహిత్ శర్మ (9) నిరాశపర్చగా, మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ 53 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.

సూర్యకుమార్ యాదవ్ (0), ఇషాన్ కిషన్ (7), హార్దిక్ పాండ్య (8) విఫలం కాగా, కృనాల్ పాండ్య (34), కీరన్ పొలార్డ్ (12 బంతుల్లో 34; 1 ఫోర్, 4 సిక్సులు), కౌల్టర్ నైల్ (12 బంతుల్లో 24; 4 ఫోర్లు) ధాటిగా ఆడడంతో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. పొలార్డ్ తన భుజబలం చూపిస్తూ కొట్టిన షాట్లు దూసుకెళ్లాయి. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. జోర్డాన్, రవి బిష్ణోయ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.

More Telugu News