అబుదాబిలో సూపర్ ఓవర్... సన్ రైజర్స్ ఏంచేస్తుందో?

18-10-2020 Sun 19:39
Super over in IPL
  • ఐపీఎల్ లో సన్ రైజర్స్ వర్సెస్ కోల్ కతా
  • మొదట 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసిన కోల్ కతా
  • లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 రన్స్ సాధించిన హైదరాబాద్

అబుదాబిలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ సూపర్ ఓవర్ లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా సరిగ్గా 163 పరుగులే చేసింది. దాంతో ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ తప్పలేదు. చివరి ఓవర్ లో 18 పరుగులు కావాల్సి ఉండగా, వార్నర్ 3 ఫోర్లు బాది సన్ రైజర్స్ ను రేసులోకి తీసుకువచ్చినా, చివరి బంతికి తడబడడంతో ఒక పరుగే వచ్చింది. దాంతో మ్యాచ్ టై అయింది.