ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

  • రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఘనంగా వివాహం
  •  హాజరైన బాలీవుడ్ ప్రముఖులు
  • వెడ్డింగ్ ఆల్బమ్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసిన కియారా
  • ప్రేమ, ఆశీస్సులు కావాలని కోరిన నటి
Kiara Advani And Sidharth Malhotra Shared their Wedding Pics

వివాహ బంధంతో ఒక్కటైన బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా తమ వెడ్డింగ్ ఆల్బమ్‌‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో మూడు అద్భుతమైన ఫొటోలు ఉన్నాయి. కియారాను మల్హోత్రా ముద్దాడుతున్న ఫొటో కూడా ఉంది. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యఘఢ్ ప్యాలెస్‌‌లో నిన్న కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. కరణ్ జొహార్, షాహిద్ కపూర్, జూహీ చావ్లా తదితరులు హాజరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకలో పలు దేశాలకు చెందిన వంటలను అతిథులకు వడ్డించినట్టు సమాచారం. త్వరలోనే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 

2021లో ‘షేర్షా’ సినిమాతో ఆన్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా నిలిచిన సిద్ధార్థ్-కియారాలు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత అది క్రమంగా పెరుగుతూ పెళ్లికి దారితీసింది. తమ వివాహ ఫొటోలను షేర్ చేసిన కియారా అద్వానీ.. దానికి..  ‘‘ఇప్పుడు మేం శాశ్వతంగా బుక్ అయిపోయాము’’ (అబ్ హమారీ పర్మనెంట్ బుకింగ్ హో గయీ హై) అని క్యాప్షన్ తగిలించారు. తమ ముందున్న ప్రయాణంలో మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. పెళ్లి ఫొటోల్లో కియారా లేత గులాబీరంగు లెహంగాలో, సిద్ధార్థ్ క్రీమ్ కలర్ షేర్వానీలో కనిపించారు. 

     

More Telugu News