Pushpa: హిందీలో రూ.70 కోట్ల క్ల‌బ్‌లోకి అల్లు అర్జున్ 'పుష్ప'

  • హిందీలో రూ.70.44 కోట్లు రాబ‌ట్టిన పుష్ప‌
  • త్వ‌ర‌లోనే రూ.75 కోట్ల క్లబ్ లోకి  
  • మంగ‌ళ‌వారం రూ.2.50 కోట్లు
  • బుధ‌వారం రూ.2.25 కోట్ల గ్రాస్
PushpaTheRise Registered a record breaking

హిందీలోనూ 'పుష్ప' జోరు కొన‌సాగుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప హిందీలో రూ.70.44 కోట్ల క్ల‌బ్‌లో చేరిందని సినీ విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ తెలిపారు. ఈ సినిమా హిందీలో గ‌త‌ శుక్ర‌వారం రూ.3.50 కోట్లు, శ‌నివారం రూ.6.10 కోట్లు, ఆదివారం రూ.6.25 కోట్లు, సోమ‌వారం రూ.2.75 కోట్లు, మంగ‌ళ‌వారం రూ.2.50 కోట్లు, బుధ‌వారం రూ.2.25 కోట్లు రాబ‌ట్టింద‌ని ఆయ‌న చెప్పారు.
               
ఈ సినిమా గ‌త‌ నెల 17న‌ విడుద‌లైన విష‌యం తెలిసిందే.  ఇప్ప‌టికీ 'పుష్ప' సినిమా హిందీలోనూ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమా హిందీలో త్వ‌ర‌లోనే రూ.75 కోట్ల క్ల‌బ్‌లోకి వెళ్లనుంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ క‌థాంశంతో వ‌చ్చిన ఈ సినిమా ఆలిండియా రికార్డు స్థాయిలో వ‌సూళ్లు రాబ‌డుతోంది.

More Telugu News