Andhra Pradesh: ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు

Andhra Pradesh registers 4 more Omicron case
  • నిన్న 7 ఒమిక్రాన్ కేసుల నమోదు
  • ఇప్పటికి మొత్తం 28 ఒమిక్రాన్ కేసులు 
  • కరోనా కేసులు కూడా క్రమంగా పెరుగుతున్న వైనం
ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈరోజు మధ్యాహ్నానికి మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, మరో దేశం నుంచి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఈ నలుగురిలో ఒకరు మహిళ అని అధికారులు తెలిపారు.

ఇక తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరుకుంది. తాజాగా ఒమిక్రాన్ బారిన పడిన వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు, గుంటూరు జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. నిన్న 7 ఒమిక్రాన్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రలో కరోనా కేసులు కూడా మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న సాయంత్రం ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 24 గంటల్లో 334 కేసులు నమోదయ్యాయి.
Andhra Pradesh
Omicron
Updates

More Telugu News