ఏపీలో కొత్తగా మరో 540 కరోనా కేసుల నమోదు... అప్డేట్స్ ఇవిగో!

14-10-2021 Thu 17:08
  • రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృతి
  • కరోనా నుంచి కోలుకున్న 557 మంది
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,588
AP registers 540 new corona cases in last 24 hours

ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 40,350 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 540 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 10 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 557 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,59,122కి పెరిగాయి. మొత్తం 20,38,248 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,286 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,588 యాక్టివ్ కేసులు ఉన్నాయి.