ఏపీలో కొత్తగా 1,115 కేసులు.. అప్ డేట్స్ ఇవిగో!

31-08-2021 Tue 17:25
  • రాష్ట్ర వ్యాప్తంగా 19 మంది మృతి
  • మహమ్మారి  నుంచి కోలుకున్న 1,265 మంది
  • ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 14,693
AP register 1115 new corona cases

ఏపీలో కరోనా కేసుల నమోదు స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 52,319 మంది శాంపిల్స్ ను పరీక్షించగా 1,115 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 210 కేసులు నమోదు కాగా.. కర్నూలులో కేవలం 9 కేసులు మాత్రమే వచ్చాయి.

ఇదే సమయంలో 1,265 మంది కరోనా నుంచి కోలుకోగా... 19 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,14,116కి పెరిగింది. 19,85,566 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,857 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,693 యాక్టివ్ కేసులు ఉన్నాయి.