ఏపీలో కొత్తగా 1,546 కరోనా కేసుల నమోదు

03-08-2021 Tue 18:12
  • చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 284 కేసులు  
  • రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 20,170
AP registers 1546 new positive cases in last 24 hours

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,546 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 284 కేసులు, కడప జిల్లాలో అత్యల్పంగా 14 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 1,940 మంది కరోనా నుంచి కోలుకోగా... 18 మంది మృతి చెందారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 19,71,554కి పెరగగా... 19,37,956 మంది రికవర్ అయ్యారు. మొత్తం 13,428 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి.