తెలంగాణలో కొత్తగా 691 కరోనా కేసుల నమోదు

21-07-2021 Wed 20:54
  • జీహెచ్ఎంసీలో 85 కేసుల నమోదు  
  • కరోనా నుంచి కోలుకున్న 565 మంది బాధితులు
  • తెలంగాణలో రికవరీ రేటు 97.85 శాతం
Telangana registers 691 new Corona cases

తెలంగాణలో గత 24 గంటల్లో 691 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 85, ఖమ్మం జిల్లాలో 56, కరీంనగర్ జిల్లాలో 55 కేసులు నమోదు కాగా, కామారెడ్డి జిల్లాలో అసలు కేసులేవీ నమోదు కాలేదు. ఇదే సమయంలో 565 మంది కరోనా బాధితులు కోలుకోగా... ఐదుగురు మృతి చెందారు.

ఇక తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,38,721కి చేరుకుంది. ఇప్పటి వరకు 6,25,042 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 3,771 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 1,14,260 మందికి కరోనా పరీక్షలను నిర్వహించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా రికవరీ రేటు 17.33 శాతంగా ఉండగా తెలంగాణలో 97.85 శాతంగా ఉంది.