ఏపీ కరోనా అప్ డేట్స్... కొత్తగా 2,527 కేసుల నమోదు!

21-07-2021 Wed 17:23
  • ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,412
  • అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 515 కేసులు
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 23,939 
Andhra Pradesh registers 2527 new corona cases

ఏపీలో కరోనా కేసుల నమోదు స్థిరంగా కొనసాగుతోంది. నిన్న 2,498 కేసులు నమోదు కాగా... గత 24 గంటల్లో 2,527 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 515 కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 43 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,412 మంది కోలుకోగా... 19 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్నవారికంటే కొత్తగా నమోదైన కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం.

తాజా గణాంకాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 19,46,749 మంది కరోనా బారిన పడగా, వారిలో 19,09,613 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,197 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,939 యాక్టివ్ కేసులు ఉన్నాయి.