ఏపీలో 4,458 కరోనా కొత్త కేసుల నమోదు.. అప్ డేట్స్

25-06-2021 Fri 17:29
  • 24 గంటల్లో 38 మంది మృతి
  • తూర్పుగోదావరి జిల్లాలో 909 కేసుల నమోదు
  • రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 47,790
AP registers 4458 cases

ఏపీలో గత 24 గంటల్లో 4,458 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చాలా రోజుల తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య వెయ్యికి దిగువకు వచ్చింది. ఆ  జిల్లాలో 909 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో అత్యల్పంగా 64 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,313 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో మహమ్మారి వల్ల 38 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా తొమ్మిది మంది చనిపోయారు.

తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 18,71,475కి చేరుకున్నాయి. 18,11,157 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 12,528 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 47,790 యాక్టివ్ కేసులు ఉన్నాయి.