ఏపీలో కరోనా విజృంభణ.. ఒకే రోజు 21 వేలకు పైగా కేసుల నమోదు

12-05-2021 Wed 18:22
  • 24 గంటల్లో 21,452 పాజిటివ్ కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 89 మంది మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,97,370
AP registers more than 21000 cases in a single day

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 21,452 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 89 మంది కరోనా వల్ల మృతి చెందారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కేసులు (2,927) నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 19,095 మంది కోలుకున్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,44,386 కేసులు నమోదు కాగా... 11,38,028 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 8,988 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,97,370 యాక్టివ్ కేసులు ఉన్నాయి.