ఏపీలో కరోనా కల్లోలం.. ఒకే రోజు 10 వేల వరకు కొత్త కేసుల నమోదు!

21-04-2021 Wed 18:38
  • గత 24 గంటల్లో 9,716 పాజిటివ్ కేసుల నిర్ధారణ
  • రాష్ట్ర వ్యాప్తంగా 38 మంది మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60,208
AP registers nearly 10 thousand Corona new cases in 24 hours

ఏపీలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. గత 24 గంటల్లో 39,619 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా... ఏకంగా 9,716 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మూడు జిల్లాల్లో కేసుల సంఖ్య వెయ్యి దాటడం ఆందోళనను పెంచుతోంది. శ్రీకాకుళం జిల్లాలో 1,444 కేసులు, గుంటూరు జిల్లాలో 1,236 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,180 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 106 కేసులు వచ్చాయి.

గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 9,86,703కి చేరింది. మొత్తం 9,18,985 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య 7,510కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 60,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి.