ఏపీలో కొత్తగా 74 కరోనా పాజిటివ్ కేసులు

08-03-2021 Mon 17:40
  • గత 24 గంటల్లో 25,907 మందికి కోవిడ్ టెస్టులు
  • కర్నూలు జిల్లాలో అత్యధికంగా 13 మందికి పాజిటివ్
  • ప్రస్తుతం రాష్ట్రంలో 1,009 యాక్టివ్ కేసులు
AP registers 74 new corona cases

ఏపీలో గత 24 గంటల్లో 25,907 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... వారిలో 74 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదే సమయంలో అనంతపురం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు ఇదే సమయంలో గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చెప్పున కరోనా వల్ల మరణించారు.

గత 24 గంటల్లో 61 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,90,766 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 8,82,581 మంది కోలుకోగా... 7,176 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,009 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 1,42,62,086 మంది శాంపిల్స్ ని పరీక్షించారు.