Hyderabad: కరివేపాకు ధరలకు రెక్కలు!

  • డిమాండ్ కు త‌గ్గ క‌రివేపాకు లేదు
  • ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ధ‌ర‌లు
  • మూడు రెట్లు పెరిగిన వైనం
  • కిలో క‌రివేపాకు రూ.120
curry leaf rate hiked

దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఉల్లితో పాటు అనేక నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు మ‌నం నిత్యం కూర‌ల్లో వాడే  క‌రివేపాకు ధ‌ర‌లు కూడా పెరిగిపోయాయి. క‌రివేపాకు దిగుబడి తగ్గడ‌మే ఇందుకు కార‌ణం.

మార్కెట్లో ప్ర‌స్తుతం డిమాండ్ కు త‌గ్గ క‌రివేపాకు లేదు. ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో క‌రివేపాకు రూ.120కి ఎగ‌బాకింది. క‌రివేపాకును రిటైల్‌ మార్కెట్‌లో ఒక కట్ట రూ.5 నుంచి 10కి అమ్ముతున్నారు. గ్రేటర్ హైద‌రాబాద్‌‌ పరిధిలోని మార్కెట్లలో ప్ర‌తి రోజు దాదాపు 10 టన్నుల క‌రివేపాకు దిగుమతి అవుతుంది.

ఆ ప్రాంతంలో గ‌తంలో కంటే దాని ధ‌ర‌ దాదాపు  మూడు రెట్లు పెరిగింది. గ‌తంలో ఇక్క‌డ కిలో క‌రివేపాకు రూ.40 ప‌ల‌క‌గా, ఇప్పుడు రూ.120గా ఉంది. ఏపీ నుంచి కూడా క‌రివేపాకును దిగుమ‌తి చేసుకుంటున్నారు.

కరివేపాకులో శ‌రీరానికి మేలు చేసే ల్యూటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్  ఉంటుంది. ఇది రోగ‌ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ నేప‌థ్యంలో క‌రోనా వేళ క‌రివేపాకు వినియోగం కూడా పెరిగిపోయింది. అనేక వ్యాధుల‌కు కూడా క‌రివేపాకు ఔష‌ధంలా ప‌నిచేస్తుంది.

More Telugu News