ఏపీలో కొత్తగా 41 కరోనా కేసులు

22-02-2021 Mon 17:39
  • 24 గంటల్లో 18,257 మందికి కోవిడ్ పరీక్షలు
  • కరోనా నుంచి కోలుకున్న 71 మంది
  • ప్రస్తుతం రాష్ట్రంలో 590 యాక్టివ్ కేసులు
AP registers 41 new Covid cases

ఏపీలో గత 24 గంటల్లో 18,257 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 41 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వాటిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో రాష్ట్రంలో కరోనా మృతి ఒకటి కూడా సంభవించకపోవడం గమనార్హం. 71 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,89,339కి పెరిగింది. ఇప్పటి వరకు 8,81,582 మంది కోలుకున్నారు. మొత్తం 7,167 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 590 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.