ఏపీలో కొత్తగా 51 కరోనా కేసుల నమోదు.. వివరాలు!

17-02-2021 Wed 18:16
  • గత 24 గంటల్లో 26,474 మందికి కోవిడ్ పరీక్షలు
  • చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి
  • ప్రస్తుతం రాష్ట్రంలో 607 యాక్టివ్ కేసులు
AP registers 51 new corona cases in 24 hours

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 26,474 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 51 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు కరోనా వల్ల మృతి చెందారు. 57 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,89,010కి పెరిగింది. మొత్తం 8,81,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 7,165 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 607 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.