Ramcharan: చరణ్, శంకర్ ల సినిమాలో మరో హీరో?

  • చరణ్, శంకర్ కాంబోలో భారీ చిత్రం 
  • దిల్ రాజు బ్యానర్లో 50వ చిత్రం
  • నెగటివ్ పాత్రలో మరో స్టార్ హీరో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సూపర్ డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్లో ఓ భారీ చిత్రం వస్తోందన్న వార్త ఇండస్ట్రీలో పెద్ద సంచలనం అయింది. ముఖ్యంగా శంకర్ ఒక సినిమా చేస్తున్నాడంటే దానిపై ఎంతో క్రేజ్ ఏర్పడుతుంది. దానికి తోడు ఇందులో రామ్ చరణ్ హీరో కావడంతో ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక మెగా ఫ్యాన్స్ అయితే, చెప్పేక్కర్లేదు. వాళ్ల ఆనందానికి అవధుల్లేవు.. ఈ సినిమా ఏ రేంజిలో ఉంటుందా? అన్న విషయంపై ఎవరికి వాళ్లు ఊహించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఇప్పుడు మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటించనున్నాడన్నది ఆ వార్త. అయితే, అతను పోషించేది నెగటివ్ పాత్ర అనీ, కథలో చాలా కీలకమైన పాత్ర అనీ అంటున్నారు. ఆ స్టార్ హీరో ఎంపిక కూడా పూర్తయిందని, అయితే పేరును సస్పెన్సులో వుంచారనీ తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరగడం ఖాయమనే చెప్పచ్చు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ బ్యానర్లో నిర్మిస్తున్న 50వ చిత్రం ఇది.

More Telugu News