ఏపీలో కరోనా వల్ల మరో నలుగురు మృతి... తాజా వివరాలు!

01-12-2020 Tue 17:27
  • గత 24 గంటల్లో కొత్తగా 685 కేసుల నమోదు
  • అత్యధికంగా కృష్ణా జిల్లాలో 146 కేసులు
  • ప్రస్తుతం రాష్ట్రంలో 7,427 యాక్టివ్ కేసులు
AP registers 685 new Corona cases in last 24 hours

ఆంధ్రప్రదేలో నిన్న తగ్గిన కరోనా కేసుల సంఖ్య ఈరోజు మళ్లీ కొంత మేర పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 685 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 146, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో నలుగురు వ్యక్తులు కరోనా వల్ల మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,427 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా గణాంకాలతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 8,68,749కి చేరింది. మొత్తం మరణాలు 6,996కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 1,094 మంది కరోనా నుంచి కోలుకున్నారు.