ఏపీలో కరోనా కారణంగా మరో 28 మంది మృతి.. ఈనాటి అప్టేడ్స్!

14-10-2020 Wed 20:17
AP registers 3892 new Corona cases
  • ఏపీలో క్రమంగా మెరుగుపడుతున్న పరిస్థితి
  • కొత్తగా 3,892 కరోనా కేసులు
  • 7,64,570కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

ఏపీలో రోజురోజుకూ కరోనా పరిస్థితి మెరుగుపడుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 3,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 607 కొత్త కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 104 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 7,64,570కి పెరిగింది. మొత్తం మరణాలు 6,319కి చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 41,669 యాక్టివ్ కేసులు ఉన్నాయి.