ఏపీ కరోనా అప్ డేట్స్.. కొత్తగా 6,133 కేసులు!

30-09-2020 Wed 18:45
AP registers 48 new Corona deaths in last 24 hours
  • 24 గంటల్లో 48 మంది మృతి  
  • మొత్తం మృతుల సంఖ్య 5,828 
  • 6,93,484కి పెరిగిన మొత్తం కేసుల 

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా మరో 6,133 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 983 కేసులు నమోదు కాగా... అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 216 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 6,93,484కి పెరిగింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 48 మంది మరణించారు. దీంతో, ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 5,828కి పెరిగింది. మరోవైపు 24 గంటల్లో 7,075 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,445 యాక్టివ్ కేసులు ఉన్నాయి.