AP DGP: ఆ వార్తల్లో నిజం లేదు.. విశాఖలో భూముల పరిశీలనపై డీజీపీ గౌతం సవాంగ్

  • గ్రేహౌండ్స్ శిక్షణ కోసం కేటాయించిన భూమి సరిపోదన్న డీజీపీ
  • హైదరాబాద్ గ్రేహౌండ్స్‌లా పటిష్టంగా తీర్చిదిద్దుతామన్న సవాంగ్
  • గంజాయి సాగుకు మావోల సపోర్ట్ ఉందన్న డీజీపీ
That is fake news says ap dgp goutam sawang

రాజధాని తరలింపులో భాగంగానే విశాఖలో గ్రేహౌండ్స్‌ నిర్వహణ, శిక్షణ సంస్థ కోసం భూములు పరిశీలిస్తున్నట్టు వచ్చిన వార్లలో నిజం లేదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. అది పూర్తిగా ఊహాజనితమని కొట్టిపడేశారు. హౌదరాబాద్ గ్రేహౌండ్స్ తరహాలోనే రాష్ట్రంలోనూ ఆ విభాగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుతామన్న ఆయన విశాఖపట్టణం శివారులోని ఆనందపురంలో 384 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. అలాగే, సంస్థ నిర్వహణ, శిక్షణ కోసం కేంద్రం రూ. 220 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అయితే, ప్రభుత్వం కేటాయించిన భూమి భవిష్యత్ అవసరాలకు సరిపోదని, కాబట్టి మరిన్ని భూములను పరిశీలించినట్టు చెప్పారు.

బెంగళూరు, గోవా నుంచి విజయవాడ, విశాఖ, గుంటూరు ప్రాంతాలకు డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయన్న డీజీపీ.. ఏపీ, ఒడిశా సరిహద్దులోని గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న గంజాయి సాగుకు మావోయిస్టుల సహకారం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 466 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని పేర్కొన్న ఆయన గత నెల రోజుల్లోనే 421 మందికి ఈ మహమ్మారి సంక్రమించిందని వివరించారు.

More Telugu News