Kalyan Ram: హ్యాపీ బర్త్ డే అన్నా: జూనియర్ ఎన్టీఆర్!

  • నేడు కల్యాణ్ రామ్ పుట్టిన రోజు
  • ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ అభినందనలు
  • విషెస్ చెబుతున్న పలువురు సెలబ్రిటీలు
Junior NTR Wishes to Kalyan Ram

టాలీవుడ్ హీరో, నిర్మాత కల్యాణ్ రామ్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటుండగా, జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలను తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. కల్యాణ్ రామ్ తనకు అన్నకంటే ఎక్కువని అన్నారు. "నాకు అన్నయ్యగా మాత్రమే కాదు. అంత కంటే ఎక్కువ. నాకు స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్త కూడా. నువ్వు నిజంగా అందరికన్నా బెస్ట్. హ్యాపీ బర్త్ డే కల్యాణ్ అన్నా" అని ట్వీట్ చేశారు.

కాగా, గతంలో ఎన్టీఆర్ హీరోగా, కల్యాణ్ రామ్ 'జై లవకుశ' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న చిత్రంలోనూ భాగమయ్యాడు. ప్రస్తుతం మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ చిత్రంలో కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నాడు. అతని పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.

More Telugu News