ap7am logo

అల్లు అర్జున్ పుట్టిన రోజున ఫస్టులుక్

Fri, Apr 03, 2020, 11:16 AM
Sukumar Movie
  • స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ 
  •  లారీ డ్రైవర్ గా కనిపించనున్న బన్నీ 
  •  పూర్తయిన ఫొటో షూట్
అల్లు అర్జున్ అభిమానులంతా ఆయన తదుపరి సినిమా పట్ల ఆసక్తిని చూపుతున్నారు. అల్లు అర్జున్ తదుపరి సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ పాటికే ఈ సినిమా షూటింగులో బన్నీ పాల్గొంటూ ఉండవలసింది. కరోనా కారణంగానే షూటింగ్ వాయిదా పడింది.

ఈ నెల 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి బన్నీ ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఫొటో షూట్ ను పూర్తి చేసిన సుకుమార్, ఫస్టులుక్ పైనే కసరత్తు చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా మాస్ లుక్ తో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.  
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad