మలయాళ రీమేక్ లో బాలయ్యతో పాటు మంచు విష్ణు?

Thu, Mar 26, 2020, 06:25 PM
Naga Vamsi Movie
  • మలయాళంలో హిట్ కొట్టిన సినిమా 
  •  వైవిధ్యభరిత చిత్రంగా ప్రశంసలు 
  • తెలుగులో రీమేక్ చేయనున్న నాగవంశీ 
మలయాళంలో ఇటీవల వచ్చిన 'అయ్యప్పనుం కోశియుం' అనే సినిమా అక్కడ వైవిధ్యభరితమైన చిత్రంగా విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ .. బిజూ మీనన్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. దాంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో నిర్మాత సూర్య దేవర నాగవంశీ వున్నారు. ఈ కథలో రెండు బలమైన పాత్రలు ప్రధానమైనవిగా కనిపిస్తాయి.

ఒక పాత్ర కోసం ఆయన బాలకృష్ణను అనుకున్నారు. బాలకృష్ణను ఒప్పించగలననే నమ్మకంతో వున్నారు. మరో పాత్ర కోసం ఓ యంగ్ హీరో అవసరం కావడంతో, కొంతమంది పేర్లను పరిశీలించిన ఆయన మంచు విష్ణు అయితే బాగుంటుందని అనుకుంటున్నట్టుగా సమాచారం. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. బాలకృష్ణకి .. మంచు ఫ్యామిలీకి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన ఈ కాంబినేషన్ సెట్ కావొచ్చనే అనుకుంటున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad