Team India: రోహిత్​ లేకపోవడమే భారత్‌ కొంప ముంచిందా?

  • గాయంతో రోహిత్‌ శర్మ దూరమయ్యాక కివీస్‌లో ఒక్క మ్యాచ్‌ నెగ్గని కోహ్లీసేన 
  • ఇది యాదృచ్ఛికమే అంటున్న ఇయాన్ చాపెల్
  • బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమయ్యారని విమర్శ
ndia have not won since aggressive opener Rohit Sharma got injured

భారీ అంచనాలతో న్యూజిలాండ్ పర్యటనకు వచ్చిన టీమిండియా టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించినా.. తర్వాత దారుణంగా ఆడింది. తర్వాతి ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఇందులో మూడు వన్డేలు ఉండగా, మిగతావి రెండు టెస్టులు. వన్డే, టెస్టు సిరీస్‌ల్లో ఓటమికి చాలా తప్పిదాలు ఉన్నా.. ఓ ప్రధాన ఆటగాడు జట్టులో లేని వెలితి స్పష్టంగా కనిపించింది. అతను మరెవరో కాదు స్టార్ ఓపెనర్‌‌ రోహిత్ శర్మ.

టీ20 సిరీస్‌లో రోహిత్ రెండు హాఫ్ సెంచరీలతో సత్తాచాటి జట్టు క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, చివరి టీ20లో బ్యాటింగ్ చేస్తుండగా..అతని ఎడమ కాలుకు గాయమైంది. దాంతో, వన్డే, టెస్టు సిరీస్‌లకు రోహిత్ దూరమయ్యాడు. అంతే.. జట్టు ఆట గాడి తప్పింది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్‌ చాపెల్ కూడా గుర్తించాడు. ఇది యాదృచ్ఛికం అని చాపెల్ అంటున్నా..టాపార్డర్‌‌కు వెన్నెముక లాంటి రోహిత్ లేని లోటు రెండు సిరీస్‌ల్లో స్పష్టంగా కనిపించింది. దాంతో,  రోహిత్‌పై  జట్టు ఎక్కువగా ఆధారపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కివీస్‌ చేతిలో భారత్‌ వైట్‌వాష్‌కు గురవడానికి కారణంగా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమే అని ఇయాన్‌ చాపెల్‌ విమర్శించాడు. ఇక్కడి పిచ్‌లు ఇంగ్లండ్ మాదిరిగా ఉంటాయని అన్నాడు. కివీస్‌లో చాలా జాగ్రత్తగా ఆడాలన్నాడు. కానీ, నంబర్‌‌ వన్‌ జట్టు అయిన భారత్‌ మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200 స్కోరు చేయలేకపోయిందని, అది పూర్తిగా బ్యాటింగ్‌ వైఫల్యమే అన్నాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌‌ అంటే క్రీజులోకి వచ్చి గుడ్డిగా ఆడకూడదని, జట్టు సమతూకంలో ఉడేలా, ఆటగాళ్లు తమ తమ స్థానాల్లో సౌకర్యవంతంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు.

More Telugu News