Deepika Padukone: జిమ్‌లో వెరైటీగా లుంగీ డ్యాన్స్ చేసిన హీరోయిన్‌

  • జిమ్‌లో రోప్‌తో దీపిక పదుకునే వ్యాయామం
  • రోప్‌ను అటూ ఇటూ ఆడిస్తూ డ్యాన్స్‌ చేసి, నవ్వులు చిందించిన దీపిక
  • వీడియో షేర్‌ చేసిన జిమ్ ట్రైనర్‌ 
deepika padukune lungi dance

బాలీవుడ్‌ హీరోయిన్  దీపిక పదుకునే జిమ్‌లో లుంగీ డ్యాన్స్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యతనిచ్చే హీరోయిన్లలో ఈ భామ ఒకరు. ఆ సమయంలో ట్రైనర్‌ సూచనలతో రోప్‌తో వ్యాయామం చేస్తోంది. ఆ సమయంలోనే ఆమె లుంగీ డ్యాన్స్‌కి రోప్‌ను అటూ ఇటూ ఆడిస్తూ డ్యాన్స్‌ చేసి, నవ్వులు చిందించింది.

ఈ వీడియోను ఆమె ట్రైనర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీపిక పదుకునేకు కష్టపడేతత్వంతో పాటుగానే సరదాగా ఉండే గుణమూ ఉందని ఆమె అన్నారు. ఆరు గంటల వ్యాయామం ఇలా గడిచిందని ఆమె చెప్పారు. కాగా, ఇటీవల దీపిక నటించిన 'ఛపాక్‌' సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాకు విడుదలకు ముందు ఆమె జేఎన్యూలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు తెలపడంతో విమర్శల పాలైంది.

More Telugu News