Akhil: అఖిల్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్

  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్ 
  •  ఆకట్టుకుంటున్న సిద్ శ్రీరామ్ ఆలాపన 
  •  త్వరలోనే ప్రేక్షకుల ముందుకు 
Most Eligible Bachelor Movie

అఖిల్ కథానాయకుడిగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రం రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు.

"మనసా మనసా మనసారా బ్రతిమాలా .. తన వలలో పడబోకే మనసా .. " అంటూ ఈ సాంగ్ సాగుతోంది. గోపీసుందర్ సంగీతం .. సురేంద్ర కృష్ణ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీగా 'బొమ్మరిల్లు' భాస్కర్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే వరుస పరాజయాలతో వున్న అఖిల్ కి, ఈ సినిమా తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో అభిమానులు వున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.

More Telugu News