Stock Market: మార్కెట్ ను వీడిన కరోనా భయం...భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

  • ప్రారంభంలోనే 559 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ 
  • 167 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 
  • గత వారం భారీ నష్టాలు మూటగట్టుకున్న మార్కెట్
Stock market in profit mode

చైనాలో మొదలై మరో యాభై ఏడు దేశాలకు విస్తరించిన కరోనా (కోవిడ్ 19) వైరస్ పుణ్యమా అని గత వారం కుదేలైన స్టాక్ మార్కెట్ ఈ వారం ప్రారంభం ఆశాజనకంగా మొదలయ్యింది. ఉదయం 9.45 గంటలకే సెన్సెక్స్ 559 పాయింట్లు, నిఫ్టీ 167 పాయింట్లు లాభపడడంతో మదుపరుల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి. 

పదకొండు గంటల సమయానికి  సెన్సెక్స్ 38,865 (+565.52) వద్ద, నిఫ్టీ 11,358 (+156.95) వద్ద కొనసాగుతోంది. కరోనా భయం పుణ్యాన గత వారం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ రోజు ఉదయం దేశీయ మార్కెట్ లాభాలతో మొదలయ్యింది. అయితే కరోనా భయం ఏ మాత్రం తగ్గని పరిస్థితుల్లో ఈ ట్రెండ్ తాత్కాలికమా, శాశ్వతమా? అన్నది సాయంత్రానికి గాని తెలియదు. జీఎంటర్ ట్రైన్మెంట్, ఐసీఐసీఐ, రిలయన్స్, వేదాంత, ఐఓసీ షేర్లు లాభాల్లో ప్రయాణిస్తుండగా, టెక్ మహీంద్రా, కొటక్ మహీంద్ర, ఎంఅండ్ ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

More Telugu News