Allu Arjun: కన్న తండ్రిని 'బే' అంటున్న అర్హ... తెగ వైరల్ అవుతున్న బన్నీ పోస్ట్ చేసిన వీడియో!

  • కూతురితో అల్లు అర్జున్ ముచ్చట్లు
  • పదేపదే 'బే' అని అంటున్న అర్హ
  • నన్నే అంటావా? అంటూ ముద్దులు
Adorable Video from Allu Arjun With His Daughter

తన ముద్దుల తనయ అర్హ ఏం చేసినా, దాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో అల్లు అర్జున్ పంచుకుంటూ ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా బన్నీ పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అల్లు అర్జున్, మోకాళ్లపైకి ఎక్కి కూర్చున్న అర్హ, తండ్రిని 'బే' అని అంటోంది. ఈ వీడియోలో అర్హ పదేపదే 'బే... బే' అంటూ బన్నీని అంటుండగా, నన్ను... కన్నతండ్రినే బే అంటావా? అంటూ ముద్దు చేస్తున్న దృశ్యాలున్నాయి. ఈ మొత్తం వీడియోలో ఆరుసార్లు తండ్రిని 'బే' అని అర్హ అంటుంటే, అంతకన్నా ఎక్కువ సార్లు బన్నీ, కూతురిని అదే విధంగా పిలుస్తున్నాడు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.


More Telugu News