GST: దుమ్మురేపుతున్న జీఎస్టీ వసూళ్లు.. లక్ష కోట్లు దాటేసిన వైనం

  • ఫిబ్రవరిలో రూ.1,05,366 కోట్లు వసూలు
  • జనవరితో వసూలైన వాటితో పోలిస్తే తక్కువే
  • గతేడాదితో పోలిస్తే 8.3 శాతం అధికం
GST Crosses One Lakh crores in February

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అంతకంతకూ పెరుగుతూ ప్రభుత్వ ఖజానాను నింపుతున్నాయి. ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలు దాటాయి. ఈ స్థాయిలో వసూలు కావడం ఇది వరుసగా నాలుగోసారి. ఫిబ్రవరిలో జీఎస్టీ కింద రూ.1,05,366 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ఇదే నెలతో  పోలిస్తే ఇది 8.3 శాతం అధికం కాగా, జనవరితో పోలిస్తే మాత్రం తక్కువ. ఆ నెలలో ఏకంగా రూ.1.10 లక్షల కోట్లు వసూలైంది. ఫిబ్రవరిలో వసూలైన రూ.1,05,366 కోట్లలో సీజీఎస్టీ వసూళ్లు రూ.20,569 కోట్లు కాగా,  ఎస్‌జీఎస్టీ కింద రూ.27,348 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.48,503 కోట్లు వసూలయ్యాయి. సెస్‌ల రూపంలో  8,947 కోట్లు వసూలైంది.

More Telugu News