Corona Virus: కరోనాకు గొప్ప విరుగుడు సబ్బే.. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త

  • సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల వైరస్‌ను నివారించొచ్చు
  • వైరస్‌ చుట్టూ ఉండే కొవ్వుతో కూడిన పొరను సబ్బు తొలగిస్తుంది
  • పొర తొలగిపోతే వైరస్ చచ్చిపోతుంది
Clean Hands With Soap And Away From Coronavirus

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మన దరికి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రొపెసర్, శాస్త్రవేత్త కారెన్ ఫ్లెమింగ్ వివరించారు. కేవలం సబ్బును ఉపయోగించి ఈ మహమ్మారిని దూరంగా ఉంచొచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై సబ్బు గొప్ప ఆయుధంగా పనిచేస్తుందని తెలిపారు. కరోనా వైరస్ చుట్టూ కొవ్వుతో కూడిన పలుచని పొర ఉంటుందని, సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఆ పొర తొలగిపోతుందని అంటున్నారు. సబ్బునీటికి అంతటి శక్తి ఉందని, ఆ పొర తొలగిపోయిన వెంటనే వైరస్ చనిపోతుందని ఆమె వివరించారు.

More Telugu News