Kamal Haasan: ఇండియన్-2 ప్రమాదంపై కమల్ హాసన్ కు నోటీసులు

  • ఇండియన్-2 సెట్స్ పై విరిగిపడిన క్రేన్
  • ముగ్గురు దుర్మరణం
  • ఎల్లుండి సీసీబీ ఎదుట హాజరుకావాలని కమల్ కు నోటీసులు పంపిన పోలీసులు
Police issues notice to Kamal Haasan

చెన్నై శివార్లలో ఇండియన్-2 సినిమా చిత్రీకరణ సందర్భంగా జరిగిన ప్రమాదంపై హీరో కమల్ హాసన్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఎల్లుండి సీసీబీ ఎదుట హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపారు. కమల్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రం షూటింగ్ లో క్రేన్ విరిగిపడి ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్ బాయ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దర్శకుడు శంకర్ కు, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు.

More Telugu News