milk: పాలు, పెరుగు తీసుకుంటే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు తక్కువట!

  • గుర్తించిన ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ పరిశోధకులు 
  • తొమ్మిది దేశాల్లోని 4.18 లక్షల మందిపై పరిశోధన
  • ఆహారపు అలవాట్లు, ఆరోగ్యాన్ని పరిశీలించన పరిశోధకులు
take milk and curd for reducing brain stroke threat

మనిషి శరీరంలోని రక్తనాళాల్లో ఏదైనా అవరోధం కలగడాన్ని స్ట్రోక్‌ అంటారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తే మెదడు కణాలు త్వరగా నిర్వీర్యం అవటం ప్రారంభిస్తాయి. నిలువెత్తు మనిషిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ ప్రమాదకర స్థితి వల్ల మనిషి అకాల మరణం చెందుతాడు. అయితే, మనం తినే ఆహారంలో భాగంగా పాలు, పెరుగు, జున్ను, పండ్లు బాగా తీసుకుంటే ఈ ముప్పును అధిగమించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

తొమ్మిది దేశాల్లోని 4.18 లక్షల మంది ఆహారపు అలవాట్లు, ఆరోగ్యాన్ని పరిశీలించి ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. ఫైబర్‌ అత్యధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు తిన్నా మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు.

More Telugu News