Asia Cup: మమ్మల్ని అడగకుండా మీ నిర్ణయం ఏంటి? గంగూలీని తప్పుబట్టిన ఎహ్సాన్ మణి!

  • ఆసియా కప్ పోటీలపై ఇంకా నిర్ణయించలేదు
  • దుబాయ్ తో పాటు ఎన్నో ప్రత్యామ్నాయాలున్నాయి
  • పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఎహ్సాన్ మణి
PCB Slams Ganguly Over Asia Cup

ఆసియా కప్ పోటీలు ఈ సంవత్సరం దుబాయ్ లో జరుగుతాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహ్సాన్ మణి తీవ్రంగా తప్పుబట్టారు. ఆసియా కప్ పోటీలపై తాము ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆసియా ఖండంలోని మిగతా జట్లను కూడా సంప్రదించిన తరువాతనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

తమ దేశంలో ఈ టోర్నీ జరుగకపోయినా, దుబాయ్ తో పాటు మరెన్నో ప్రత్యామ్నాయ వేదికలు ఉన్నాయని ఆయన అన్నారు. కాగా, ఈ సంవత్సరం ఆసియా కప్ పోటీలు పాకిస్థాన్ లో షెడ్యూల్ చేశారు. పాక్ కు వెళ్లేందుకు భారత్ సుముఖంగా లేదు. ఇండియా లేకుండా ఆసియా కప్ పోటీలకు స్పాన్సర్లతో పాటు, అభిమానులు కూడా తగ్గుతారని భావించిన పీసీబీ, ఈ పోటీలను మరో దేశంలో జరిపించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల గంగూలీ, ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దుబాయ్ లో పోటీలు ఉంటాయని, ఇండియా, పాక్ లు మరోసారి తలపడతాయని వెల్లడించారు.

More Telugu News