Corona Virus: అమెరికాలో తొలి 'కొవిడ్-19' మృతి నమోదు!

  • ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19
  • వాషింగ్టన్ లో మరణించిన వ్యక్తి
  • అమెరికాలో 66 మందికి వైరస్
First Death in USA due to Corona

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్-19 (కరోనా వైరస్), అమెరికాకూ విస్తరించి తొలి ప్రాణాన్ని బలిగొంది. వాషింగ్టన్ లో శనివారం వైరస్ బారినపడి, ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి కన్నుమూశాడని ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ 66 మందికి వ్యాధి సోకిందని వీరంతా ఏదో ఒక సమయంలో చైనా, దక్షిణ కొరియా తదితర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారేనని తెలిపింది. ఈ వైరస్ ను విస్తరించకుండా చూసేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకున్నామని పేర్కొంది. వైరస్ సోకిన వారికి ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోందని వెల్లడించింది.

More Telugu News