Team India: భారత బౌలర్లు ఫెయిల్.. తొలి రోజు న్యూజిలాండ్‌దే!

  • భారత్ 242 ఆలౌట్
  • పృథ్వీ, పుజారా, విహారి హాఫ్ సెంచరీలు
  • జెమీసన్‌ను ఐదు వికెట్లు 
  • న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ 63/0
  • ముగిసిన తొలి రోజు ఆట
Indian bowlers failed to get a wicket

ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ హాఫ్ సెంచరీలు చేసి జట్టుకు గౌరవప్రద స్కోరు అందించినా.. బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడంతో న్యూజిలాండ్‌తో రెండో టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ వెనకంజ వేసింది. క్రైస్ట్‌చర్చ్‌లో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 63 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది.

యువ ఓపెనర్‌‌ పృథ్వీ షా (54), చతేశ్వర్‌‌ పుజారా (54), హనుమ విహారి (55) అర్ధ శతకాలతో రాణించారు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (3), మయాంక్ అగర్వాల్‌ (7), అజింక్యా రహానే (7), రిషభ్ పంత్ (12), రవీంద్ర జడేజా (9) నిరాశ పరిచారు. కివీస్‌ బౌలర్లలో కైల్‌ జెమీసన్‌ (5/45) ఐదు వికెట్లతో భారత్‌ను దెబ్బకొట్టాడు. టిమ్‌ సౌథీ (2/38), ట్రెంట్‌ బౌల్ట్ (2/89) చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ మొదటి రోజు ఆట చివరకు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. టామ్‌ లాథమ్ (27 బ్యాటింగ్‌), టామ్‌ బ్లండెల్‌ (29 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 23 ఓవర్లు బౌలింగ్‌ చేసిన భారత బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు.

More Telugu News