Vishwak Sen: తెలుగు రాష్ట్రాల్లో 'హిట్' తొలిరోజు వసూళ్లు

  • నిన్ననే థియేటర్లకు వచ్చిన 'హిట్'
  • మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ 
  • వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణ    
HIt Movie

విష్వక్సేన్ కథానాయకుడిగా రూపొందిన 'హిట్' చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా విష్వక్సేన్ కనిపించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో, నాయిక పాత్రలో రుహానీ శర్మ నటించింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 1.4 కోట్ల షేర్ ను రాబట్టింది. శని .. ఆదివారాల్లో వసూళ్లు పెరగవచ్చని భావిస్తున్నారు. ఒక మర్డర్ .. ఒక మిస్సింగ్ చుట్టూ తిరిగే కథ ఇది. ఆ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో విష్వక్సేన్ నటన ఆకట్టుకుంటుంది. వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు. నాని సొంత బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా, వసూళ్ల పరంగా  ఏ స్థాయి వరకూ వెళుతుందో చూడాలి.

More Telugu News