Mukesh Ambani: కరోనా దెబ్బకు భారీగా నష్టపోయిన అంబానీ, అదానీ, బిర్లాలు!

  • కుబేరులపై కరోనా వైరస్ ప్రభావం
  • పాతాళానికి పడిపోయిన స్టాక్ మార్కెట్
  • రూ. 36 వేల కోట్లు కోల్పోయిన ముఖేశ్ అంబానీ
Huge Loss for Indian Billioneers

ప్రపంచ కుబేరులపై కరోనా వైరస్ ప్రభావం గట్టిగానే తగిలింది. వైరస్ వ్యాపిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటం, దీంతో ప్రపంచ జీడీపీ గణనీయంగా తగ్గుతుందని వచ్చిన విశ్లేషణల నేపథ్యంలో, స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కాగా, బిలియనీర్ల సంపద కూడా పడిపోయింది. సంపదను నష్టపోయిన వారిలో భారత కుబేరులు కూడా ఉన్నారు.

ముఖేశ్ అంబానీ అత్యధికంగా నష్టపోయాడు. ఇతని సంపద గత సంవత్సరంతో పోలిస్తే 5 బిలియన్ డాలర్లు తగ్గింది. అంటే దాదాపు రూ. 36 వేల కోట్ల సంపదను ఆయన కోల్పోయినట్టు. ఇక, ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్ జీ 869 మిలియన్ డాలర్లు, ఆదిత్య బిర్లా 884 మిలియన్ డాలర్లు, గౌతమ్ అదానీ 496 మిలియన్ డాలర్ల మేరకు నష్టపోయారు. ఇదే సమయంలో ఉదయ్ కోటక్, దిలతీప్ సంఘ్వీల సంపద కూడా తగ్గిపోయింది.

కరోనా వైరస్ భయాలతో ఈక్విటీ మార్కెట్లు పడిపోతుంటే, కుబేరులకు వాటాలు ఉన్న కంపెనీల మార్కెట్ కాప్ తగ్గుతోంది. ఈ కారణంతోనే వారి ఆస్తి విలువ కూడా తగ్గిపోతోంది. ముఖ్యంగా గత రెండు వారాల నుంచి... ఇంకా చెప్పాలంటే, ఫిబ్రవరి 12 నుంచి ఇప్పటివరకూ సెన్సెక్స్ 3 వేల పాయింట్లు నష్టపోగా, ఇన్వెస్టర్ల సంపద రూ. 11.52 లక్షల కోట్లు హారతి కర్పూరమైంది. రిలయన్స్ షేర్ల విలువ 13 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం.

More Telugu News