మార్చి 4న ఏపీ మంత్రి వర్గ సమావేశం

28-02-2020 Fri 19:00
  • వెలగపూడి సచివాలయంలో భేటీ కానున్న కేబినెట్
  • సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం
  • పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం
Ap cabinet meet on March 4th

ఏపీ కేబినెట్ మరోమారు సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలో మార్చి 4న మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు సహా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.