AR Rehaman: ట్రంప్ తో విందుకు ప్రత్యేక అతిథి వచ్చింది... ఏఆర్ రెహమాన్ పోస్ట్ చేసిన ఫన్నీ వీడియో ఇదిగో!

  • ఈ వారం ప్రారంభంలో ట్రంప్ పర్యటన
  • రాష్ట్రపతి విందుకు హాజరైన రెహమాన్
  • ఓ కోతి వస్తే, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
Mokey in Trumps Dinner

ఈ వారం ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన కుటుంబంతో సహా భారత్ లో పర్యటించగా, వారి గౌరవార్థం రాష్ట్రపతి ప్రత్యేక విందును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విందుకు ప్రధాని, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇదే విందుకు హాజరైన ఆస్కార్ విన్నర్, ఏస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

అందరూ విందుకు కూర్చున్న వేళ, ఓ మర్కటం అక్కడికి వచ్చి, పూల కుండీ పక్కన కూర్చుని విందు ఆరగించింది. సదరు కోతి ఆకులను తింటుంటే, వీడియో తీసిన రెహమాన్, "ఓ చిట్టి స్నేహితుడు కూడా విందుకు వచ్చాడు" అని కామెంట్ చేస్తూ, దాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇక ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News