Nithin: 50 కోట్ల దిశగా పరుగులు తీస్తున్న 'భీష్మ'

  • ఈ నెల 21వ తేదీన వచ్చిన 'భీష్మ'
  • 6 రోజుల్లో 41.30 కోట్ల వసూళ్లు 
  • నితిన్ - రష్మిక జోడీకి మంచి మార్కులు
Bheeshma Movie

నితిన్ కథానాయకుడిగా రూపొందిన 'భీష్మ' .. ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, ఆ తరువాత కూడా అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది.

దేశ వ్యాప్తంగా 6 రోజుల్లో ఈ సినిమా 28.70 కోట్లను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 41.30 కోట్లను రాబట్టిన ఈ సినిమా, 50 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా, యూఎస్ లోను తన దూకుడు కొనసాగిస్తోంది. దగ్గరలో గట్టి పోటీనిచ్చే సినిమాలేవీ లేకపోవడం వలన, ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. కామెడీ .. సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ప్రధానమైన పాత్రను పోషించాయనీ, ఈ కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News