సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Thu, Feb 27, 2020, 07:21 AM
Rashi khanna in Rajkot for Sunder flick
  • రాజ్ కోట్ లో రాశిఖన్నా 
  • మహేశ్ సరసన పూజ హెగ్డే 
  • చరణ్ తో 'భీష్మ' దర్శకుడు
 *  తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'అరణ్మనై' చిత్రానికి మూడో భాగం రూపొందుతోంది. ఇందులో ఆర్యకు జోడీగా రాశిఖన్నా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కోసం రాశిఖన్నా రాజ్ కోట్ లో షూటింగ్ చేస్తోంది.
*  చిరంజీవి, కొరటాల కాంబోలో రూపొందుతున్న భారీ చిత్రంలో మహేశ్ బాబు ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇక ఇందులో మహేశ్ సరసన కథానాయికగా పూజ హెగ్డే కోసం ప్రయత్నిస్తున్నట్టు తాజా సమాచారం.
*  తాజాగా నితిన్ హీరోగా 'భీష్మ' చిత్రాన్ని రూపొందించి హిట్ చేసిన దర్శకుడు వెంకీ కుడుముల త్వరలో రామ్ చరణ్ తో ఓ చిత్రం చేసే అవకాశం వుంది. తాజాగా చరణ్ కు వెంకీ ఓ కథ చెప్పాడనీ, చరణ్ కు అది నచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ తయారుచేసే పనిలో వెంకీ వున్నాడట.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement