Kamal Haasan: గతంలో షూటింగ్‌లో అనుమతి లేకుండా కమలహాసన్‌ ముద్దుపెట్టుకున్నాడన్న హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం

  • కె.బాలచందర్‌ దర్శకత్వంలో 1986లో వచ్చిన 'పున్నగై మన్నన్‌' సినిమా
  • ముద్దు సన్నివేశం  గురించి తనకు చెప్పలేదన్న హీరోయిన్
  • ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు
rekha about kamal kiss in movie

కె.బాలచందర్‌ దర్శకత్వంలో 1986లో వచ్చిన 'పున్నగై మన్నన్‌' సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటనను ఓ ఇంటర్వ్యూలో నటి  రేఖ గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో కమల హాసన్‌ సరసన రేఖ నటించారు. ఓ ముద్దు సన్నివేశాన్ని దర్శకుడు తీస్తోన్న సమయంలో ఆ విషయం గురించి తనకు స్పష్టంగా చెప్పలేదని ఆమె తెలిపారు.

తన అనుమతి తీసుకోకుండానే బాలచందర్‌ చెప్పినట్లుగా కమలహాసన్‌ తనని ముద్దు పెట్టుకున్నారని ఆమె చెప్పారు. ముద్దు సన్నివేశమన్న విషయాన్ని ముందే చెబితే  తాను అంగీకరించేదాన్ని కాదని తెలిపారు. ఆమె ఆ విషయాన్ని చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో కమలహాసన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆమెకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటున్నారు.  సోషల్‌ మీడియాలో ఈ వీడియో ఇంతగా వైరల్ అవుతుండడం పట్ల రేఖ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోసారి స్పందిస్తూ తన అనుమతి లేకుండానే వాళ్లు ముద్దు సన్నివేశాన్ని తీసినప్పటికీ, ఆ సన్నివేశం ఆ సినిమాకి ఎంతగానో ఉపయోగపడిందని ఆమె తెలిపింది. ఆ సినిమాలోని ఈ సన్నివేశాన్ని కూడా ఇప్పుడు నెటిజన్లు ఆసక్తికరంగా వెతికి మరీ చూస్తున్నారు.

More Telugu News