New Delhi: కేజ్రీవాల్ ఇంటి ముట్టడి.. అల్లర్ల కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

  • ఈ తెల్లవారుజామున సీఎం ఇంటి ముట్టడి
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • 13కు పెరిగిన మృతుల సంఖ్య
Police disperse the people who had gathered outside Chief Minister Arvind Kejriwal residence

జామియా మిలియా ఇస్లామియా అలూమ్నీ, జామియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఈ తెల్లవారుజామున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించి ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకుని చెదరగొట్టారు. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలను హింసాత్మకంగా మార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నిరసనకారులు డిమాండ్ చేశారు.

హింస చెలరేగిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, పర్యటించాలని కోరారు. నిందితులపై చర్యలు తీసుకుని శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. పరిస్థితులను అదుపు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేజ్రీవాల్ మంగళవారం రాత్రి సమీక్షించారు.

More Telugu News