Chandrababu: తెలంగాణ కన్నా మనదే పెద్ద రాష్ట్రం.. అయినప్పటికీ ట్రంప్‌తో విందుకు జగన్‌ను ఎందుకు ఆహ్వానించలేదంటే..!: చంద్రబాబు

  • దీని గురించి విలేకరులు ఏమనుకుంటున్నారు? 
  • నా కామెంట్‌ కంటే మీ కామెంట్ ముఖ్యం కదా?  
  • అమెరికా చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి
  • కేసులుండే వ్యక్తులను కలవరు.. అది కూడా ఓ అడ్డంకి 
chandrababu fires on ap govt

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విందు ఇస్తోన్న నేపథ్యంలో ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను మాత్రం ఆహ్వానించలేదు. దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ రోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ... 'దీని గురించి విలేకరులు ఏమనుకుంటున్నారు? నా కామెంట్‌ కంటే మీ కామెంట్ ముఖ్యం కదా? తెలంగాణ కంటే ఏపీ పెద్ద రాష్ట్రం.. అయినప్పటికీ ఆహ్వానం అందలేదు. అమెరికా చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. కేసులుండే వ్యక్తులను కలవరు. అది కూడా ఓ అడ్డంకి. కియా మోటార్‌స్ ఇక్కడ పెట్టారు.. కానీ, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడకూడదు అని అగ్రిమెంట్‌లోనే పెట్టారు. అంతర్జాతీయ కంపెనీలు కొన్ని విలువలు పాటిస్తాయి' అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.

More Telugu News