'భీష్మ' నాలుగు రోజుల వసూళ్లు

25-02-2020 Tue 11:18
  • తెలుగు రాష్ట్రాల్లో 'భీష్మ' విజయవిహారం 
  • యూఎస్ లోను అదే జోరు 
  • రష్మిక జోరును మరింత పెంచిన 'భీష్మ'  
Bheeshma movie

ప్రేమ కోసం .. ప్రేమించిన అమ్మాయి కోసం ఒక యువకుడు ఎలాంటి రిస్క్ చేశాడనే కథాంశంతో రూపొందిన 'భీష్మ' చిత్రం ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 19.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, ఈ నాలుగు రోజుల్లోనే 16.71 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

చాలా వేగంగా ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడుతుండటం, ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. దగ్గరలో చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోవడంతో, 'భీష్మ' జోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా నితిన్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోవడం ఖాయమని అంటున్నారు. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వెళుతున్న రష్మిక జోరును ఈ సినిమా మరింతగా పెంచింది. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళుతుండటం విశేషం.